: సహాయక చర్యలు చేపట్టిన దాఖలాలు కనిపించడం లేదు: కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ
హైదరాబాద్‌లోని నిజాంపేటలో వర్షబీభత్సానికి పలు ఇళ్లు, అపార్ట్‌మెంట్లలోకి నీరు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఆ ప్రాంతాన్ని టీపీసీసీ నేత షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి సందర్శించారు. అక్కడి భండారీ లే అవుట్‌ను సందర్శించిన అనంతరం షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నష్టనివారణ చర్యలు చేపట్టడంలోను, ముందు జాగ్రత్తలు తీసుకోవడంలోను ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. సహాయక చర్యలు చేపట్టిన దాఖలాలు కనిపించడం లేదని ఆయన అన్నారు. వరద కష్టాల నుంచి ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.