: ప్రత్తిపాడు ఎమ్మెల్యే కుమారుడిపై రేప్ కేసు నమోదు
వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరిన తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు కుమారుడు రాజాబాబుపై రేప్ కేసు నమోదైంది. వివాహం చేసుకుంటానని నమ్మించిన రాజాబాబు తనను మోసం చేశాడని గిరిజన యువతి సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు రేప్ కేసు కూడా నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. వైద్యపరీక్షల కోసం ఆమెను కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్టు సర్పవరం ఎస్సై తెలిపారు. ఇదిలా ఉండగా, తన కుమారుడిని రక్షించుకునేందుకు ఎమ్మెల్యే తెరవెనుక మంత్రాంగం నెరపుతున్నట్టు బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.