: అమెరికాలోని న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో హై అలర్ట్
అమెరికాలోని న్యూయార్క్ పరిధిలోని మన్ హాటన్ ప్రాంతంలో గత ఆదివారం భారీ పేలుడు సంభవించి, 27 మంది తీవ్రంగా గాయపడిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో అదే నగరంలో లగార్డియా ఎయిర్ పోర్టులో ఓ వాహనం అలజడి రేపింది. ఆ వాహనం ఎవరిదో, అక్కడ ఎందుకు నిలిపారో ఎవరికీ తెలియలేదు. దీంతో ఎయిర్‌పోర్టు పరిధిలో హై అలర్ట్ ప్రకటించారు. ఎయిర్‌పోర్టులోని బి టెర్మినల్‌ను అధికారులు ఖాళీ చేయించారు. భారీ భద్రతా ఏర్పాట్లు చేసి, తనిఖీలు కొనసాగిస్తున్నారు. దీని గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.