: రాహుల్ పై విరుచుకుపడిన నరేంద్ర మోడీ


కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీపై గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ నిప్పులు చెరిగారు. ఒక్క వ్యక్తి వల్ల ఏం ఒరగదు అని రాహుల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు మోడీ ఘాటుగా స్పందించారు. ఒక్క వ్యక్తి ఏం చేయగలడో తాను చేసి చూపిస్తానంటూ సవాల్ విసిరారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడీ నేడు బెంగళూరులో జరిగిన బీజేపీ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ, 'సంపన్నుల ఇంట పుట్టి పెరిగిన రాహుల్ భారత చరిత్రను పెద్దగా చదవినట్టు లేదు. ఇలాంటి ప్రబోధాత్మక ప్రసంగాలు చేసేముందు ఆయన కాసింత హోమ్ వర్క్ చేయాలి' అని సలహా ఇచ్చాడు.

ఒక్క వ్యక్తి అన్ని సమస్యలకు పరిష్కారం చూపలేరన్న రాహుల్ వ్యాఖ్యలు పండిట్ నెహ్రూ, ఇందిరాగాంధీ విషయంలో వాస్తవమేనని మోడీ ఎద్దేవా చేశారు. కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి ప్రతి విషయంలోనూ తమదైన ముద్ర వేయగలిగారని మోడీ గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News