: సహారా అధినేత సుబ్రతోరాయ్ పెరోల్ రద్దు... అదుపులోకి తీసుకోవాలని ఆదేశం


సహారా ఇండియా అధినేత సుబ్రతోరాయ్ పెరోల్ రద్దు చేస్తున్నట్టు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రకటించింది. ఆయనను తక్షణం అదుపులోకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. సుబ్రతోరాయ్ తల్లి మరణించడంతో ఆయనకు సుప్రీంకోర్టు పెరోల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం న్యాయస్థానానికి ష్యూరిటీగా చెల్లించాల్సిన నిధుల సేకరణతోపాటు, తల్లి అంతిమ సంస్కారం చేయాల్సిన బాధ్యత తనపై ఉందని, ఆ కార్యక్రమాలు ముగించుకుని కోర్టు సూచించిన మొత్తం సమీకరిస్తానని సుబ్రతోరాయ్ సుప్రీంకోర్టుకు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో న్యాయస్థానం విధించిన గడువులోగా ష్యూరిటీ చెల్లించకపోవడంతో ఆయన పెరోల్ ను రద్దు చేసి, ఆయనను కస్టడీకి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

  • Loading...

More Telugu News