: విశాఖలో ట్రెడ్ ఫెయిర్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రులు


ఆంధ్రప్రదేశ్ వాణిజ్య రాజధాని విశాఖపట్టణంలోని ఆంధ్రాయూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన ఇండియన్ ఇంటర్నేషనల్ (భారత అంతర్జాతీయ) మెగా ట్రేడ్ ఫెయిర్ ను కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్ కలసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ కంభంపాటి హరిబాబు, ఏపీ బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఆక్వా రంగంలోని వ్యాపార, వాణిజ్య అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరారు. సుదీర్ఘ సముద్రతీరం కలిగిన కోస్తాలో ఆక్వా రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News