: నాంపల్లి కోర్టుకు హాజరైన జగన్, విజయసాయిరెడ్డి, అయోధ్య రామిరెడ్డి, వెంకట్రామిరెడ్డి
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జన్మోహన్ రెడ్డి నేడు నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. సాక్షి పత్రికలో రాంకీ సంస్థ పెట్టుబడులపై విచారిస్తున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) న్యాయస్థానం సమన్లు జారీ చేయడంతో నాంపల్లిలోని గగన్ విహార్ లోని ఈడీ, సీబీఐ కోర్టులకు జగన్ హాజరయ్యారు. జగతి పబ్లికేషన్స్ లో రాంకీ పెట్టిన 10 కోట్ల రూపాయల పెట్టుబడులు అక్రమమని పేర్కొంటూ ఈడీ అభియోగపత్రం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణకు జగన్ తోపాటు విజయసాయిరెడ్డి, వెంకట్రామిరెడ్డి, అయోధ్యరామిరెడ్డిలు హాజరుకావాలని ఈడీ కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారంతా నేడు కోర్టుకు హాజరయ్యారు.