: లిబియాలో ఉగ్రవాదులు విడుదల చేసిన బలరాం, గోపీ నేడు స్వదేశాగమనం


ఏడాదికిపైగా లిబియాలో ఉగ్రవాదుల నిర్బంధంలో ఉండి, ఇటీవలే వారి చెర నుంచి విడుదలైన ఇద్దరు తెలుగు వ్యక్తులు నేడు భారత్ చేరుకోనున్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. తెలంగాణకు చెందిన సి. బలరాం కిషన్‌, ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన టి. గోపీకృష్ణలు గత ఏడాది జూలై 29 నుంచి ఉగ్రవాదుల చెరలో బందీలుగా ఉన్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రయత్నాలు ఫలించడంతో వారు ఉగ్రవాదుల చెర నుంచి విడుదలయ్యారు. లిబియా నుంచి వారు నేడు దిల్లీకి చేరుకుని, అక్కడి నుంచి ఏపీ, తెలంగాణకు చేరుతారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి వికాస్‌ స్వరూప్‌ తెలిపారు.

  • Loading...

More Telugu News