: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు అస్వస్థత...అపోలోకు తరలింపు
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో బాధపడుతున్న ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఆమె వ్యక్తిగత వైద్యులు గత అర్ధరాత్రి చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. వివిధ పరీక్షలు నిర్వహించిన వైద్యులు చికిత్సనందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.