: కొన్ని అంశాలపై ఏపీ, తెలంగాణ మధ్య అవగాహన కుదిరింది: సీఎం చంద్రబాబు
ఇటీవల జరిగిన అపెక్స్ కౌన్సిల్ లో కొన్ని అంశాలపై తెలంగాణ, ఏపీల మధ్య అవగాహన కుదిరిందని నవ్యాంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీ 512 టీఎంసీలు, తెలంగాణ 299 టీఎంసీల నీటిని వాడుకునే హక్కుందన్నారు. ఘర్షణ వాతావరణం లేకుండా నీటిని వినియోగించుకోవాలని వివరించి చెప్పానని అన్నారు. నీటి పంపకాలను కేంద్రంతో పాటు రెండు రాష్ట్రాల అధికారులు పర్యవేక్షించేలా అవగాహనకు వచ్చామని బాబు తెలిపారు. టెలీ మెట్రిక్ విధానంతో ఎవరు ఎంత నీటిని వాడుకుంటున్నారో తెలుస్తుందని, వాటాలను నిర్ణయిస్తే ఆ ప్రకారమే వాడుకుంటామని చంద్రబాబు చెప్పారు.