: హైదరాబాద్ లో వరద సహాయక చర్యలు.. ఆల్వాల్ లో రంగంలోకి దిగిన ఆర్మీ


హైదరాబాద్ నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు, రోడ్లు, అపార్టుమెంట్లు పార్కింగ్ స్థలాలు జలమయం అయ్యాయి. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. అయితే, ఎడతెరిపి లేని వర్షం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుండటంతో అధికారులు చేతులెత్తేస్తున్నారు. దీంతో, జీహెచ్ఎంసీ అధికారులు ఆర్మీ సాయం కోరారు. అధికారుల వినతి మేరకు ఆర్మీ రంగంలోకి దిగింది. ఆల్వాల్ లో పర్యటించి అక్కడి పరిస్థితిని ఆర్మీ పరిశీలిస్తోంది.

  • Loading...

More Telugu News