: భర్తను ఇమిటేట్ చేసి నవ్వులు పూయించిన మిషెల్లీ ఒబామా


ఫస్ట్ లేడీ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ మిషెల్లీ ఒబామా తన భర్తను ఇమిటేట్ చేస్తూ చెప్పిన మాటలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి. ప్రముఖ టీవీ హోస్ట్ స్టీఫెన్ కాల్బర్ట్ నిర్వహించే ‘ద లేట్ షో’లో మిషెల్లీ ఒబామా ముచ్చటించింది. వైట్ హైస్ లో కుటుంబమంతా కలిసి డిన్నర్ చేస్తున్నప్పుడు ఎలాంటి వాతావరణం ఉంటుందనే సందర్భాన్ని మిషెల్లీ వివరిస్తూ.. డిన్నర్ చేస్తున్నప్పుడు తన పెద్ద కూతురు మలియా గ్లోబల్ వార్మింగ్ వంటి సీరియస్ ప్రశ్నలను తన తండ్రిని అడుగుతూ ఉంటుందని, ఈ ప్రశ్నలకు ఒబామా ఎలా వివరిస్తూ పోతారనే దానిని మిషెల్లీ ఇమిటేట్ చేశారు. ‘ వెల్, ఈ ప్రశ్న అడగడం సంతోషంగా ఉంది. మూడు పాయింట్లతో సమాధానం వివరిస్తాను. పాయింట్1, పాయింట్ 1ఏ, పాయింట్ 1ఏబీ అంటూ’ ఒబామా సమాధానం చెబుతారని అనగానే ఈ షోకు హాజరైన ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వుకోవడమే కాదు, చప్పట్లు కొట్టి మరీ అభినందించారు. అయితే, తాను, తన చిన్న కూతురు సాషా మాత్రం ఇష్టమైన పాటల గురించి మాట్లాడుకుంటామని మిషెల్లీ చెప్పారు. కాగా, ఇందుకు సంబంధించిన వీడియోను నిన్న సాయంత్రం యూట్యూబ్ లో పెట్టారు. ఇప్పటికే 10 లక్షలకు పైగా ఈ వీడియోను చూశారు.

  • Loading...

More Telugu News