: హైద‌రాబాద్‌లో ఎక్క‌డిక‌క్క‌డే నిలిచిన వాహ‌నాలు.. గంట‌సేపు ప్ర‌యాణం వాయిదా వేసుకోవాలని పోలీసుల సూచ‌న


హైద‌రాబాద్‌లో ప్ర‌యాణికులు, వాహ‌న‌దారుల‌కు చుక్కలు క‌నిపిస్తున్నాయి. మూడు రోజులుగా కురుస్తున్న వ‌ర్షాల‌కి ఇప్పటికే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటున్న భాగ్య‌న‌గ‌ర‌వాసులు నేడు మ‌ళ్లీ కురిసిన వ‌ర్షాల‌తో న‌ర‌క‌యాత‌న అనుభ‌విస్తున్నారు. న‌గ‌రంలోని ప్ర‌ధాన కూడ‌ళ్ల‌లో వాహ‌నాలు బారులు తీరాయి. ల‌క్డీక‌పూల్ నుంచి మెహిదీప‌ట్నం వ‌ర‌కు ట్రాఫిక్‌ స్తంభించింది. పంజాగుట్ట ర‌హ‌దారి గుండా వాహ‌నాలు ముందుకు క‌ద‌ల‌డం లేదు. మ‌రోవైపు పీవీ ఎక్స్ ప్రెస్ హై వేపై వాహ‌నాల రాక‌పోక‌లకు అనుమ‌తి నిరాక‌రిస్తున్నారు. ఈ నేపథ్యంలో న‌గ‌రంలో గంట‌సేపు ప్ర‌యాణం వాయిదా వేసుకోవాలని ట‌్రాఫిక్‌ డీసీపీ రంగ‌నాథ్ సూచించారు.

  • Loading...

More Telugu News