: మ్యాగీ నూడిల్స్ ధ్వంసం విషయమై ‘సుప్రీం’ను ఆశ్రయించిన ‘నెస్లే ఇండియా’
గడువుతీరిన మ్యాగీ నూడిల్స్ ను ధ్వంసం చేసే విషయమై నెస్లే ఇండియా సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గడువు తీరిన 550 టన్నుల నూడిల్స్ నిల్వల ధ్వంసంకు అనుమతి విషయమై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) అంగీకరించకపోవడంతో సంస్థ తరపున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నెస్లే సంస్థ గతంలో ఇదే సమస్యను లేవనెత్తిందని, ఈ వ్యవహారంలో అటార్నీ జనరల్ ముకుల్ సూచనలను పాటించాల్సి ఉందని ఎఫ్ఎస్ఎస్ఏఐ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ సి. నాగప్పన్ తో కూడిన బెంచ్ ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 30 వ తేదీకి వాయిదా వేసింది.