: అమరవీరుడికి రూ. 2 లక్షల పరిహారం ప్రకటించిన మమతా బెనర్జీ... 'వీరజవాన్లు బిచ్చగాళ్లు కాదంటూ హ్యాష్ ట్యాగ్' వైరల్


గత సంవత్సరం మక్కాకు వెళ్లి మరణించిన వ్యక్తికి రూ. 10 లక్షల పరిహారం ప్రకటించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, యూరీలోని ఆర్మీ బేస్ లో ఉగ్రదాడిలో మరణించిన వీరజవాను కుటుంబానికి రూ. 2 లక్షల పరిహారం ప్రకటించడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. 'వీరజవాన్లు బిచ్చగాళ్లు కాదంటూ హ్యాష్ ట్యాగ్' పెట్టిన మెసేజ్ పై తృణమూల్ సర్కారును, మమత తీరును ఎండగడుతున్నారు. ఇప్పటికే మమతా బెనర్జీ రూ. 2 లక్షల సాయం, హోంగార్డు ఉద్యోగాన్ని అమరవీరుల కుటుంబాలు తిరస్కరించాయి. ఆ సహాయం తమకు అక్కర్లేదని స్పష్టం చేశాయి. మమతా బెనర్జీ లౌకికవాదానికి ఆమె ప్రకటించిన సాయం నిదర్శనమని, కుహనా రాజకీయాలకు ఈ నిర్ణయం అద్దం పడుతోందని, ఆమె వెళ్లి పాక్ ఆర్మీలో చేరవచ్చని, ఇదేనా సెక్యులరిజం? అని విమర్శల ట్వీట్ల వర్షం కురుస్తోంది.

  • Loading...

More Telugu News