: పాతాళానికి కూరుకుపోయిన కరాచీ స్టాక్ మార్కెట్


గడచిన రెండు రోజులుగా ఐక్యరాజ్యసమితి వేదికగా, పాకిస్తాన్ కు వ్యతిరేకంగా వస్తున్న వార్తలు, ఉగ్రవాదాన్ని పాక్ అరికట్టాల్సిందేనంటూ పలు దేశాల నుంచి వస్తున్న ఒత్తిడి పాక్ లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను తీవ్రంగా దెబ్బతీశాయి. ఓ వైపు స్వాతంత్ర్యం కోసం ఉద్యమాన్ని ఉద్ధృతం చేసిన బెలూచిస్థాన్ అంశం, కాశ్మీర్ పై దాడుల వల్ల దేశంపై వస్తున్న దౌత్యపరమైన ఒత్తిడి నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ వాటాలను విక్రయించేందుకే మొగ్గు చూపారు. దీంతో కేఎస్ఈ (కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్) ఏకంగా 569 పాయింట్లు నష్టపోయింది. అత్యంత కీలకమైన మద్దతు స్థాయిగా పరిగణించే 40 వేల పాయింట్ల నుంచి పడిపోయి 39,771 పాయింట్లకు చేరుకుంది. తదుపరి సెషన్లలోనూ పాక్ మార్కెట్లు ఒత్తిడిలోనే కొనసాగవచ్చని, ఈ పరిస్థితి పాక్ ఇన్వెస్టర్లను ఆందోళనకు గురి చేస్తోందని 'డెయిలీ టైమ్స్' అంచనా వేసింది.

  • Loading...

More Telugu News