: చాలా ఏళ్ల తరువాత దాదాపు 16 సెం.మీ.ల వర్షం పడింది: మంత్రి కేటీఆర్
హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాల ధాటికి అతలాకుతలమైన పలు ప్రాంతాలను ఈరోజు జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌తో కలిసి తెలంగాణ మంత్రి కేటీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. చాలా ఏళ్ల తరువాత దాదాపు 16 సెం.మీ.ల వర్షం పడిందని అన్నారు. వర్షాలతో అన్ని ప్రాంతాలు జలమయమయ్యాయని అన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళితే సహాయక చర్యలు సులభతరమవుతాయని అన్నారు. అధికారులతో కలిసి అన్ని ప్రాంతాలను పరిశీలించినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో అధికారులకు ఫోన్ చేయాలని సూచించారు.