: శిక్షలు షురూ... విజయ్ మాల్యా సహచరుడికి ఏడాదిన్నర జైలు శిక్ష
లిక్కర్ కింగ్ గా, లగ్జరీ పురుషుడిగా ఎన్నో భోగాలు అనుభవించి, ప్రస్తుతం బ్యాంకులకు డబ్బెగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా పాపాల వెనుక భాగం పంచుకున్న వారికి శిక్షలు మొదలయ్యాయి. గతంలో జీఎంఆర్ గ్రూప్ నకు కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ ఇచ్చిన చెక్ బౌన్స్ కాగా, ఈ కేసులో విచారణ జరిపిన హైదరాబాద్ కోర్టు, కింగ్ ఫిషర్ అధికారి, విజయ్ మాల్యాకు సన్నిహితుడిగా ముద్రపడ్డ ఎ.రఘునాథన్ కు 18 నెలల జైలు శిక్షను విధిస్తూ నేడు తీర్పిచ్చింది. జీఎంఆర్ కు రూ.50 లక్షల విలువైన చెక్ ను కింగ్ ఫిషర్ ఇవ్వగా, అది చెల్లలేదన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో మాల్యా మొదటి ముద్దాయి కాగా, రఘునాథన్ ఏ2గా ఉన్నారు. మాల్యా కోర్టుకు హాజరైన తరువాతనే ఆయనకు శిక్ష ఖరారు చేస్తామని ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.