: రాజకీయాలకు అతీతంగా పని చేయాలి: ఢిల్లీలో సీఎం కేసీఆర్
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు కేంద్రమంత్రి దత్తాత్రేయను కలిసి, పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో దత్తాత్రేయ చొరవ చూపాలని ఆయన కోరారు. నిన్న జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం గురించి ఆయన దత్తన్నకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కేంద్రం నుంచి అందాల్సిన నిధులు ఆలస్యం కాకుండా అందాలని అన్నారు. తన పర్యటన సందర్భంగా రామగుండం ఫెర్టిలైజర్స్ ప్లాంట్ పునరుద్ధరణ పనులపై కేంద్రంతో చర్చించి, అందుకోసం సాయం చేయాలని కోరినట్లు చెప్పారు.