: మరొక అరెస్ట్.. ఆప్‌ ఎమ్మెల్యే సోమనాథ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు


ఢిల్లీలోని అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీకి క‌ష్టాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌ల‌పై ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను నిన్న పోలీసులు అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈరోజు అదే పార్టీ నుంచి మ‌రో ఎమ్మెల్యే సోమనాథ్‌ భారతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలో ఇప్పటికే 11 మంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు ప‌లు కేసుల్లో అరెస్టైన విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల‌ ఢిల్లీలోని ఎయిమ్స్ ప్రాంగ‌ణంలో భద్రతా సిబ్బందిపై మండిప‌డ్డ‌ సోమ‌నాథ్ వారిపై దాడికి దిగారు. అంతేగాక‌, అక్క‌డి వ‌స్తువుల‌ను త‌మ పార్టీ కార్యకర్తలతో క‌లిసి ధ్వంసం చేశారు. ఘ‌ట‌న‌పై ఎయిమ్స్‌ చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ రావత్ చేసిన ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న‌ పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News