: సుమంత్ 'నరుడా డోనరుడా' ఫస్ట్ లుక్ పై టాలీవుడ్ హీరోల సరదా వ్యాఖ్యలు!


సుమంత్ నటిస్తున్న 'నరుడా డోనరుడా' సినిమా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను తన తాతగారైన అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా సుమంత్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫస్ట్ లుక్ పై టాలీవుడ్ నటులు తమదైన శైలిలో స్పందిస్తూ ఆకట్టుకుంటున్నారు. తొలుత ఈ లుక్ పై సమంత్ మేనమామ నాగార్జున అక్కినేని స్పందించారు. సుమంత్ పోస్టర్ ను చూసి ఆశ్చర్యపోయానని అన్నారు. స్పెర్మ్ డోనర్ గా సుమంత్ నటించడం ఆశ్చర్యం కలిగించిందని ఆయన పేర్కొన్నారు. తర్వాత రానా దగ్గుబాటి స్పందిస్తూ, 'ఆ పిల్లలు కూడా తండ్రిలా డోనరులు లాంటివారేనా? సుపర్బ్.. సుమంత్ అన్నా!' అంటూ వ్యాఖ్యానించాడు. ఇక మరో హీరో నాని ఈ పోస్టర్ పై స్పందిస్తూ, 'మొత్తానికి తెలుగు సినీ పరిశ్రమలో సుమంత్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ అన్నమాట!' అంటూ చమత్కరించాడు. అలాగే నాగచైతన్య, చైతూ స్పందిస్తూ, 'సినిమాను చూడడానికి చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నా'మని అన్నారు. సుమంత్ రెండో పోస్టర్ పై అఖిల్ వ్యాఖ్యానిస్తూ...'ఈ ఈతగాళ్లు కనువిందు కలిగిస్తా'రని ఆశిస్తున్నామని అన్నారు.

  • Loading...

More Telugu News