: నా నియోజకవర్గాన్ని జిల్లా చేయకుంటే రాజీనామా చేస్తా: టీఆర్ఎస్ ఎమ్మెల్యే హెచ్చరిక


వికారాబాద్ కేంద్రంగా నూతన జిల్లాను ఏర్పాటు చేయకుంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బి.సంజీవరావు హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వికారాబాద్ ను జిల్లాగా మారుస్తానని కేసీఆర్ ఇచ్చిన హామీని గుర్తు చేసిన ఆయన, ఒకసారి మాటిస్తే, దాన్ని తప్పే వ్యక్తి ఆయన కాదని అన్నారు. 19 మండలాలతో కూడిన వికారాబాద్ జిల్లా సాకారమవుతుందని, ఈ విషయంలో కేసీఆర్ వెనక్కి తగ్గబోరని అన్నారు. జిల్లాను అడ్డుకునేందుకు కొందరు కృత్రిమ ఉద్యమాలు చేస్తున్నారని మండిపడ్డ సంజీవరావు, జిల్లా గెజిట్ 28వ తేదీలోగా వస్తుందని, అలా రాకుంటే తాను రాజీనామా చేస్తానని చెప్పారు.

  • Loading...

More Telugu News