: ధైర్యంగా హత్య చేశారు... దెయ్యమయ్యాడన్న భయంతో పోలీసులకు దొరికిపోయారు


తమ చేతుల్లో హతుడైన వ్యక్తి దెయ్యమై ప్రతీకారం తీర్చుకుంటున్నాడన్న భయంతో హంతకులు పోలీసులకు పట్టుబడ్డ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. నాగపట్టణంలోని కేకేనగర్ కు చెందిన కార్తీశన్ అనే వ్యక్తి భార్యను సునామీ నివాస గృహాల్లో ఉంటున్న మత్స్యకారుడైన శంకర్ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. దీనిని భరించలేకపోయిన కార్తీశన్ తన ఐదుగురు స్నేహితులతో ప్లాన్ చేసి, మద్యం తాగేందుకు శంకర్ ను ఆహ్వానించాడు. పూటుగా మద్యం తాగించిన తరువాత గడ్డపారతో అతని తలపై మోది హత్య చేశారు. అనంతరం అతని ఇంటి వెనుక శంకర్ ను పాతిపెట్టారు. ఈ క్రమంలో హత్యలో పాలుపంచుకున్న దినకరన్ ప్రమాదంలో మృతిచెందాడు. తాము హత్య చేసిన శంకర్ దెయ్యంగా మారి దినకరన్ ను పొట్టనపెట్టుకున్నాడని భావించారు. దీంతో తమలో కాస్త ధైర్యవంతుడైన అన్బరసన్ ఇంటివద్దకు శంకర్ శవాన్ని మార్చాలని భావించి, అక్కడ గొయ్యి తవ్వుతుండగా పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో విచారించిన పోలీసులకు శంకర్ హత్య గురించి బయటపెట్టారు. దీంతో అన్బరసన్, మణికంఠన్, శివ, కార్తీశన్, మారెక్స్ లను పోలీసులు అదుపులోకి తీసుకుని, న్యాయస్థానంలో హాజరుపరిచారు.

  • Loading...

More Telugu News