: ప్రారంభమైన ప్రతిష్ఠాత్మక టెస్టు...ఆచితూచి ఆడుతున్న ఆటగాళ్లు...టీమిండియా 8/0


టీమిండియా ప్రతిష్ఠాత్మక 500వ టెస్టు మ్యాచ్ కాన్పూర్ వేదికగా ప్రారంభమైంది. 1932 జూన్ 22 నుంచి 28 వరకు జరిగిన ఐదు రోజుల మ్యాచ్ తో ఇంగ్లండ్ గడ్డపై టెస్టుల్లో అరంగేట్రం చేసిన భారత జట్టు 84 ఏళ్లలో 499 టెస్టు మ్యాచ్ లు ఆడింది. నేడు 500వ టెస్టు మ్యాచ్ ను ఆడుతోంది. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకోగా, కివీస్ బౌలింగ్ ప్రారంభించింది. భారత బ్యాటింగ్ ను కేఎల్ రాహుల్, ఛటేశ్వర్ పూజారా ప్రారంభించగా, తొలి ఓవర్ ను ట్రెంట్ బౌల్ట్ సంధించాడు. తొలి బంతిని వదిలేసిన రాహుల్, మలిబంతిని బౌండరీకి తరలించాడు. తరువాతి స్వింగర్ ను వదిలేసిన రాహుల్ నాలుగో బంతిని బౌండరీకి పంపాడు. ఆ తరువాత వచ్చిన గుడ్ లెంగ్త్ బంతిని గౌరవించిన రాహుల్, ఆరోబంతిని లెగ్ వికెట్ మీదుగా ఆడే ప్రయత్నం చేశాడు. అయితే ఫీల్డర్ అడ్డుకోవడంతో బౌండరీ మిస్ అయింది. దీంతో తొలి ఓవర్ ముగిసేసరికి టీమిండియా వికెట్లేమీ నష్టపోకుండా 8 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News