: ప్రతిష్ఠాత్మక టెస్టులో భారత్ బ్యాటింగ్...కివీస్ ఫీల్డింగ్


భారత జట్టు ఆడుతున్న ప్రతిష్ఠాత్మక 500వ టెస్టు మ్యాచ్ లో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయనుంది. టాస్ గెలిచిన కోహ్లీ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్ పై పెద్దగా పచ్చిక లేకపోవడానికి తోడు బీటలు వారి ఉండడంతో కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. మ్యాచ్ కొనసాగే కొద్దీ పిచ్ మందకొడిగా మారి, స్పిన్ కు అనుకూలించనుంది. దీంతో తొలుత ఫీల్డింగ్ తీసుకుంటే బ్యాటింగ్ చేయడం కష్టమని భావించిన కోహ్లీ తొలి టెస్టులో విజయమే లక్ష్యంగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఈ టెస్టులో తొలి బంతిని ట్రెంట్ బౌల్ట్ సంధించనున్నాడు. టీమిండియా శిఖర్ ధావన్ కు విశ్రాంతినిచ్చి ఛటేశ్వర్ పూజార, కేఎల్ రాహుల్ ను ఒపెనర్లుగా బరిలో దించనుంది. టీమిండియా అశ్విన్, జడేజా, షమి, ఉమేష్ లపై నమ్మకం ఉంచగా, కివీస్ రోంచీ, ట్రెంట్ బౌల్ట్, సోధీ, సాంటనర్, క్రెయిగ్ పై నమ్మకం పెట్టుకుంది.

  • Loading...

More Telugu News