: నరసరావుపేట వద్ద వరదనీటిలో చిక్కుకుపోయిన మార్నింగ్ స్టార్ బస్సు...ప్రయాణికుల ఆక్రందనలు!


గుంటూరు జిల్లాలో కురుస్తున్న వర్షాల ధాటికి వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో నరసరావుపేట శివార్లలో ప్రవహిస్తున్న వరదనీటిలో 'మార్నింగ్ స్టార్' ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, రెండు కార్లు, ఒక ఆటో చిక్కుకున్నాయి. వరద ప్రవాహం పెరుగుతుండడంతో ఆందోళనకు గురైన ప్రయాణికులు రక్షించాలంటూ కేకలు వేశారు. దీంతో స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు సహాయక చర్యలు చేపట్టారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల ధాటికి రైల్వే ట్రాకులపైకి నీరు చేరడంతో ఫలక్ నుమా, పల్నాడు ఎక్స్ ప్రెస్ లను నిలిపేశారు.

  • Loading...

More Telugu News