: తొలి టెస్టులో మా వ్యూహమిదే: న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్


కాన్పూర్ వేదికగా నేడు ప్రారంభం కానున్న తొలి టెస్టుమ్యాచ్ లో టీమిండియాపై న్యూజిలాండ్ జట్టు అనుసరించనున్న వ్యూహాన్ని ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ వెల్లడించాడు. కాన్పూర్ లో ఆయన మాట్లాడుతూ, టీమిండియాకి నాణ్యమైన స్పిన్నర్లున్నారని అన్నారు. అదీ కాక సొంతగడ్డపై ఆడిన అపార అనుభవం కూడా టీమిండియాకు కలిసివస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ఇదే ఏడాది ఉపఖండంలో జరిగిన టీ20 ప్రపంచకప్‌ లో న్యూజిలాండ్ యువ స్పిన్నర్లు రాణించిన విషయాన్ని మర్చిపోవద్దని హెచ్చరించాడు. భారత్ స్పిన్ త్రయం ఆయుధంగా బరిలో దిగుతున్న వేళ, తాము కూడా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నామని తెలిపాడు. స్పిన్ వ్యూహంతోనే భారత్ కు అడ్డుకట్ట వేస్తామని కేన్ విలియమ్సన్ స్పష్టం చేశాడు. టీ20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ స్పిన్నర్ల ఉచ్చులో చిక్కుకుని టీమిండియా బ్యాట్స్ మన్ విలవిల్లాడిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News