: నన్ను ప్రధానిని చేస్తే కాశ్మీర్ సమస్య పరిష్కరించేస్తా: అజంఖాన్
ముస్లిం మతస్తుడిని కావడం వల్లే తాను ప్రధాని పదవిని పొందలేకపోతున్నానని సమాజ్ వాదీ పార్టీ నేత అజంఖాన్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని అయ్యేందుకు కావలసిన అర్హతలన్నీ తనకు ఉన్నాయని, అయితే, తాను ముస్లిం మతస్థుడిని కావడమే ప్రధాన సమస్యగా పరిణమించిందన్నారు. తనను కనుక ప్రధానిని చేస్తే, కేవలం ఏడాదిలోపే కాశ్మీర్ సమస్యను ఒక కొలిక్కి తెస్తానని.. అఖండ భారత్ ను నిర్మిస్తానని అన్నారు. ఈ సందర్భంగా యూరీ సెక్టార్ పై ఉగ్రదాడులను పిరికిపంద చర్యగా ఆయన అభివర్ణించారు. యూరీ ఘటనపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విధానాలేమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తనపై విమర్శలు చేసే ప్రత్యర్థులు ‘మొరిగే కుక్కలు’ అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సమాజ్ వాదీ పార్టీ ఎల్లప్పుడూ సమైక్యంగా ఉంటుందని అజంఖాన్ పునరుద్ఘాటించారు.