: సినీ నిర్మాత కొర్రపాటి సాయి ఆఫీసుపై ఐటీ దాడులు
'వారాహి చలన చిత్రం' అధినేత, ప్రముఖ సినీ నిర్మాత కొర్రపాటి సాయి ఆఫీసుపై హైదరాబాదులోని ఐటీ శాఖాధికారులు దాడులు నిర్వహించారు. ‘ఈగ’, ‘జ్యో అచ్యుతానంద’ సినిమాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. ఇటీవల విడుదలైన ‘జ్యో అచ్యుతానంద’ సినిమాకు హిట్ టాక్ వచ్చింది. ఈ చిత్రంలో నారా రోహిత్, నాగశౌర్య, రెజీనా ప్రధాన పాత్రల్లో నటించారు.