: కశ్మీర్‌లో భారీ టెర్రర్ డంప్ స్వాధీనం
ఉగ్రవాదులు దేశంలోకి చొరబడి దాడులకు దిగుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో భారత సైన్యం, పోలీసులు జమ్ముకాశ్మీర్‌లో క్షుణ్ణంగా తనఖీలు నిర్వహిస్తున్నారు. సోదాల్లో భాగంగా ఈరోజు ఉగ్రవాదులకు సంబంధించిన భారీ డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. సిఆర్‌పిఎఫ్, రాష్ట్ర పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో ఈరోజు త్రాల్‌లోని కమ్లా అటవీ ప్రాంతంలో తనిఖీలు చేస్తుండగా ఈ డంప్ దొరికిందని అధికారులు తెలిపారు. అందులో భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలు దొరికాయి. వాటిల్లో ఏకే56 రైఫిల్, స్నిఫర్ రైఫిల్, మిషన్ గన్, ఇతర పేలుడు పదార్థాలు, బుల్లెట్లు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.