: స్వాతంత్ర్య సమరయోధుల పింఛన్ పెంపునకు కేంద్రం ఆమోదం
స్వాతంత్ర్య సమరయోధులకు పింఛన్ పెంచుతానని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ నెరవేరనుంది. స్వాతంత్ర్య సమరయోధులకు ఇచ్చే ఫింఛన్ ను 20 శాతం పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ, 'ఈరోజు ఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో ఈ అంశంపై ఒక నిర్ణయం తీసుకున్నాం. నాడు మోదీ చేసిన ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది' అన్నారు. కాగా, స్వాతంత్ర్య సమరయోధులకు లేదా వారసులకు ఇచ్చే పింఛన్ ను 20 శాతం పెంచుతామని, డీఏ కూడా పెంచుతామని ఆగస్టు 15న ఎర్రకోట పై నుంచి మోదీ నాడు చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు.