: ఆ సన్నివేశం లీక్ పై నోరువిప్పిన రాధికా ఆప్టే


ప్రముఖ బాలీవుడ్ నటి రాధికా ఆప్టే నటించిన ‘పార్చ్ డ్’ చిత్రంలో ఆమె నగ్నంగా నటించిన సన్నివేశాల విజువల్స్ ఇటీవల లీక్ అయిన సంగతి విదితమే. ఈ సన్నివేశాలు లీక్ కావడంపై రాధికా ఆప్టే మాట్లాడుతూ, ‘దీనిపై నేనేమీ స్పందించలేను. నిజం చెప్పాలంటే, ఏ చిత్రంలోని నగ్న సన్నివేశాలైనా ఇంటర్ నెట్ లో దొరుకుతున్నాయి. ఈ చిత్రాన్ని ప్రతిఒక్కరూ చూడాలని కోరుకుంటున్నాను. ఇటువంటి సినిమాల్లో నటించాలి. కానీ, వీటిని బహిరంగంగా ప్రదర్శించకూడదని నేనెప్పుడూ అనుకోలేదు. ఆ విధంగా ఆలోచించడంలో అర్థం లేదు’ ఆమె చెప్పింది. కాగా, ఈ చిత్రంలో తనిష్టా ఛటర్జీ, సుర్వీన్ చావ్లా, అదితి గుప్తా, ఆదిల్ హుస్సేన్ తదితరులు నటించారు. అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైన ‘పార్చ్ డ్’ ఇప్పటివరకు 18 పురస్కారాలను సొంతం చేసుకుంది. ఇప్పటికే ఏడు దేశాల్లో విడుదలైన ఈ చిత్రం భారత్ లో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • Loading...

More Telugu News