: తిరుపతిలో కత్తులు చేతపట్టుకుని సైకో వీరంగం
తిరుపతిలో ఈ రోజు ఓ సైకో హల్‌చల్ చేశాడు. అక్కడి హరేరామ హరేకృష్ణ రోడ్డులో చేతిలో కత్తులు పట్టుకుని తిరిగాడు. తనకు కనిపించిన వారిపై దాడి చేస్తూ వీరంగం చేశాడు. అంతేగాక, అక్కడి ఓ అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించి మహిళపై దాడి చేశాడు. అనంతరం తనని తాను పొడుచుకున్నాడు. గాయపడిన మహిళను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సైకోను పట్టుకొని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అతడి గురించి ఆరా తీస్తున్నారు.