: విరాట్ కోహ్లీపై మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరె ప్రశంసల జల్లు
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లిపై మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరె ప్రశంసల జల్లు కురిపించాడు. భారత్-న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కోహ్లీ సారథ్యంలో టీమిండియా సిరీస్ గెలుస్తుందని అన్నాడు. టీమిండియా ఎంతో బలంగా ఉందని, జట్టుకు ఇది మంచి అవకాశమని ఆయన అభిప్రాయపడ్డాడు. సొంతగడ్డపై టీమిండియా అద్భుతంగా రాణిస్తుందని అన్నాడు. టెస్టు కెప్టెన్ కోహ్లి దూకుడు, సామర్థ్యం ప్రతికూల పరిస్థితుల్లోనూ జట్టుకి లాభపడుతుందని ఆయన అన్నాడు. కోహ్లీ టీమిండియాను ముందుండి నడిపిస్తాడని, ఆయన ఎంతో తెలివైన ఆటగాడని ఆయన అన్నాడు. టీమిండియా స్పిన్నర్లు న్యూజిలాండ్‌తో జరగనున్న సిరీస్‌లో ప్రముఖపాత్ర వహిస్తారని చెప్పాడు.