: ఆ కేసులో ఎఫ్ఐఆర్లో నా పేరెందుకు చేర్చారు?: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్


ఢిల్లీ మహిళా కమిషన్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలను నిబంధనలకు విరుద్ధంగా నియ‌మిస్తున్నార‌ని వ‌చ్చిన ఫిర్యాదుల నేప‌థ్యంలో ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి, ఆప్ అధినేత‌ కేజ్రీవాల్ స్పందించారు. ఆ కేసును ద‌ర్యాప్తు చేస్తోన్న‌ అవినీతి నిరోధక శాఖ అధికారులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో తన పేరును చేర్చ‌డమేంట‌ని ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. అందులో తాను ఏం చేశాననే విషయాన్ని కూడా తెలప‌లేద‌ని అన్నారు. నియామ‌కాల్లో త‌న ప్ర‌మేయం ఏముంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. దీని వెనుకు కుట్ర ఉంద‌నే అనుమానాన్ని వ్య‌క్తం చేశారు. ఈ అంశంపై ప్రత్యేక విధాన సభ భేటీని ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ కేసులో ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌ప‌ర్స‌న్‌ స్వాతి మలివాల్‌పై ఇటీవ‌లే కేసులు నమోదు చేసిన ఏసీబీ అధికారులు దీనికి సంబంధించి ఇప్ప‌టికే ఆమెను ప్ర‌శ్నించిన విష‌యం తెలిసిందే.

  • Loading...

More Telugu News