: యుద్ధం వస్తే ఇండియా వెంటేనన్న బంగ్లాదేశ్
భారత్, పాకిస్థాన్ ల మధ్య యుద్ధం సంభవిస్తే, తాము ఇండియా వెనుకే నిలబడి మద్దతిస్తామని బంగ్లాదేశ్ స్పష్టం చేసింది. యూరీలో సైనిక స్థావరంపై జరిగిన ఉగ్రదాడిని ఖండించిన బంగ్లాదేశ్ హోం మినిస్టర్ అసద్ జమాన్ ఖాన్ కమాల్, పాక్ పై తీవ్ర విమర్శలు చేశారు. పాకిస్థాన్ లా ఉగ్రవాదానికి మద్దతు తెలుపుతూ, పొరుగు దేశాలపైకి వారిని పురిగొల్పే ఏ దేశమైనా బంగ్లాదేశ్ కు శత్రువేనని స్పష్టం చేశారు. 1971 నుంచి ఇండియాతో తమ స్నేహ బంధం కొనసాగుతోందని గుర్తు చేసిన ఆయన, తమ పూర్తి మద్దతు ఇండియాకేనని వివరించారు.