: '18 మంది జవాన్లకు నివాళిగా రేపు భారత్ బంద్ చేద్దాం'... వైరల్ అవుతున్న మెసేజ్ లో నిజమెంతని ఆరా తీస్తున్న యూత్


భారత యువత చేతుల్లోని స్మార్ట్ ఫోన్లలో ఇప్పుడో మెసేజ్ వైరల్ అవుతోంది. యూరీపై దాడి చేసి 18 మంది జవాన్లను బలిగొన్న పాక్ వైఖరికి నిరసనగా, రేపు భారత్ బంద్ ను పాటించాలన్నది దీని సారాంశం. జవాన్లకు నివాళిగా బంద్ చేయాలని, దాదాపు 26 ఏళ్ల తరువాత దేశమంతా ఏకతాటిపై నిలిచి బంద్ చేయడం ద్వారా ప్రభుత్వాలకు యువత మనసులో ఏముందో తెలియజేయాలని, అమర వీరులకు అదే సరైన నివాళన్న మెసేజ్ చకచకా పాకుతోంది. ఈ మెసేజ్ ని మొదట ఎవరు ఎప్పుడు పెట్టారో తెలియక పోగా, దీనిపై నిజమెంతని, ఎవరు బంద్ ను ప్రకటించారని యువత ఆరా తీస్తోంది. ఈ మెసేజ్ ని అందుకుంటున్న వారు, తన స్నేహితుల బృందానికి షేర్ చేస్తూ, బంద్ చేస్తే బాగుంటుందన్న అభిప్రాయానికి వస్తున్నారు.

  • Loading...

More Telugu News