: అరుణ్ జైట్లీతో ముగిసిన చంద్రబాబు భేటీ
కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సమావేశం ముగిసింది. విజయవాడ నుంచి హైదరాబాదు, అక్కడి నుంచి ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు నేరుగా అరుణ్ జైట్లీ వద్దకు వెళ్లి, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ప్యాకేజీకి బడ్జెట్ సమావేశాల్లో చట్టబద్ధత కల్పించాలని ఆయనను కోరారు. రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రంతో కలిసి పనిచేస్తామని ప్రకటించారు. అలాగే విశాఖపట్టణంలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని ఆయన కేంద్ర మంత్రిని కోరారు.