: సన్నీ లియోన్ గురించి పెద్దగా పట్టించుకోని సొంత ఊరి జనం!
సన్నీ లియోన్ అంటే భారత్ లో పెద్ద క్రేజ్... కెనడియన్ పోర్న్ స్టార్ గా బాలీవుడ్ లో అడుగుపెట్టిన సన్నీ లియోన్ స్టార్ డమ్ సంపాదించుకుంది. పలు బాలీవుడ్ సినిమాలకు 'ఎ' సర్టిఫికేట్ తెచ్చిపెట్టే నటనను ప్రదర్శించి యువ అభిమానులను సంపాదించుకుంది. భారత్ లో సక్సస్ అయిన ఈ కెనడియన్ పోర్న్ స్టార్ పై టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఓ డాక్యుమెంటరీని కూడా ప్రదర్శించారు. అయితే, ఈ డాక్యుమెంటరీపై సన్నీ లియోన్ జన్మస్థలమైన సార్నియా (కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్ లోని ప్రాంతం) ప్రజలను అడిగితే స్పందించేందుకు ఒక్కరు కూడా ముందుకు రాలేదు. దీంతో సన్నీలియోన్ తెగ ఫీలైపోయిందట. మన ఊరికి చెందిన అమ్మాయి దేశం కాని దేశంలో అతిపెద్ద చిత్రసీమలో పాగావేసి, స్టార్ హోదా సంపాదించుకుందని గొప్పగా చెప్పుకుంటారని ఊహించిన సన్నీ లియోన్ ను ఈ ఘటన తీవ్ర నిరాశకు గురిచేసినట్టుందని బాలీవుడ్ గుసగుసలాడుకుంటోంది.