: మూడు నెలల్లో ఫిరాయింపుదారులపై నిర్ణయం తీసుకోండి: తెలంగాణ స్పీకర్ కు హైకోర్టు సూచన


తెలంగాణ రాష్ట్ర సమితిలో టీడీఎల్పీని విలీనం చేయడంపై దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన తెలుగు రాష్ట్రాల హైకోర్టు కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు వెలువరించింది. పార్టీ ఫిరాయించిన తెలుగుదేశం ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలంది. ఈ మేరకు స్పీకర్ మధుసూదనాచారికి సూచనలు చేసింది. టీఆర్ఎస్ పార్టీలోకి వలసలు ప్రారంభమై, ఎర్రబెల్లి, కడియం వంటి కీలక నేతలంతా ఫిరాయించిన వేళ, తెలంగాణ తెలుగుదేశం విభాగాన్ని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేస్తున్నట్టు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై టీటీడీపీ కోర్టును ఆశ్రయించగా, తాజా సూచనలు వెలువడ్డాయి. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో తెలుగుదేశం తరఫున గెలిచిన వారిలో రేవంత్ రెడ్డి, ఆర్.కృష్ణయ్యలు మాత్రమే ఉండగా, మిగతా వారంతా గులాబీ కండువాలు కప్పుకున్నారు.

  • Loading...

More Telugu News