: అఖిలేష్ కు మరిన్ని ఇబ్బందులు ... మిత్రుడు అమర్ సింగ్ కు కీలక పదవి ఇచ్చిన ములాయం


ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, రాజకీయపరంగా మరిన్ని ఇబ్బందులు ఎదుర్కునే నిర్ణయాన్ని ములాయం సింగ్ యాదవ్ తీసుకున్నారు. తన దీర్ఘకాల మిత్రుడు అమర్ సింగ్ ను సమాజ్ వాదీ పార్టీ జాతీయ కార్యదర్శిగా ములాయం నియమించారు. తన లెటర్ హ్యాడ్ మీద స్వదస్తూరితో ఈ విషయాన్ని ములాయం రాయడం విశేషం. అఖిలేష్ కు అండగా నిలిచిన తన సోదరుడు రాంగోపాల్ యాదవ్ కన్నా, తనకు అమర్ సింగే ముఖ్యమన్న సంకేతాలను ఆయన వెలువరించడంతో రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం, ఇంటి గొడవలు ఇంకా సద్దుమణిగినట్టుగా భావించలేమని పరిశీలకులు అభిప్రాయపడ్డారు. ఇక ఆరేళ్ల బహిష్కరణ తరువాత, ఇటీవలే పార్టీలో చేరి రాజ్యసభ సభ్యత్వాన్ని పొందిన అమర్ సింగ్, ఇకపై పార్టీ జాతీయ కార్యదర్శిగా వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నారు. ములాయం తీసుకున్న ఈ నిర్ణయం అఖిలేష్ కు కొంత మింగుడుపడని అంశమే. అమర్ సింగ్ ను వ్యతిరేకించే అఖిలేష్, ఓ దశలో ఆయన కారణంగానే తమ ఇంట్లో విభేదాలు వచ్చాయని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ములాయం మరో సోదరుడు, అఖిలేష్ కు రాజకీయంగా దూరమైన సమాజ్ వాదీ కీలక నేత శివపాల్ యాదవ్ కు అమర్ సింగ్ మద్దతిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News