: ఏపీలో లెక్చరర్... తమిళనాడులో బైకు దొంగ... ఇప్పటికి 223 బైకులు లేపేశాడు!


ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలో లెక్చరర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి తమిళనాడులో కరుడుగట్టిన దొంగ అని తేలిన ఘటన వేలూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... వేలూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో పీఈటీ (ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్) గా పని చేస్తున్న ప్రభు (4) ఈ నెల 9వ తేదీన తన ద్విచక్రవాహనాన్ని ఇంటి ముందు పార్క్ చేశాడు. తెల్లారిలేచి చూసేసరికి తన ద్విచక్రవాహనం కనిపించలేదు. దీంతో ఆయన ఆర్కాడు టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు వేలూరుకు చెందిన ఇమ్రాన్ భాషా (26)ను అదుపులోకి తీసుకుని బైకు స్వాధీనం చేసుకున్నారు. ఆయన చిత్తూరు ప్రధాన పట్టణంలోని ఓ ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలో లెక్చరర్ గా పని చేస్తున్నాడు. ఖాళీ సమయాల్లో బైకులు చోరీ చేసి విక్రయించే ఆయన ఇప్పటి వరకు 223 బైకులను చోరీ చేసి విక్రయించాడని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News