: విజయవాడ మీదుగా ప్రయాణించవలసిన 25 రైళ్లు రద్దు
నేడు విజయవాడ మీదుగా ప్రయాణించవలసిన 25 రైళ్లు రద్దయ్యాయి. విజయవాడ రైల్వే స్టేషన్ లో సిగ్నలింగ్ వ్యవస్థ ఆధునికీకరణలో భాగంగా ఇంటర్ లాకింగ్ సిస్టమ్ ను పునర్వ్యవస్థీకరించనున్నారు. దీనికి ఎల్ఈడీ సొబగులద్దనున్నారు. అందులో భాగంగా విజయవాడ రైల్వే స్టేషన్ లో పనులు ప్రారంభమయ్యాయి. నిన్నటి నుంచి విజయవాడ రైల్వే స్టేషన్ లో రైళ్ల రాకపోకలు నిలిపేశారు. వారధి మీదుగా పలు రైళ్లను దారిమళ్లిస్తున్నారు. దీంతో విజయవాడ రైల్వే స్టేషన్ ను తాకకుండానే రైళ్లు ప్రయాణిస్తున్నాయి. సుమారు పది రోజులపాటు ఇదే పరిస్థితి ఎదురు కానుంది. దీంతో రైలు ప్రయాణికులు షెడ్యూల్ ప్రకారం బయల్దేరాలని అధికారులు సూచిస్తున్నారు.