: దక్షిణాది నటుడు నన్ను రూంకి రమ్మన్నాడు... చెవులు వాచేలా తిట్లుతిన్నాడు: రాధికా ఆప్టే సంచలన వ్యాఖ్యలు
ఇంగ్లిష్ సినీ వెబ్ సైట్ తో మాట్లాడుతూ సినీ నటి రాధికా ఆప్టే సంచలన విషయం వెల్లడించింది. నటిగా కెరీర్ ప్రారంభించిన తొలినాళ్లలో తాను కూడా అందర్లాగే ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపింది. అయితే ఇబ్బందులు ఎదురయ్యాయని తానెప్పుడూ అడ్డదారులు తొక్కలేదని తెలిపింది. 'ఓ సారి ఓ నటుడు... దక్షిణాదికి చెందిన వాడనుకుంటా, ఫోన్ చేసి తన గదికి రమ్మని పిలిచాడు. అంతటితో ఆగకుండా తన చపలచిత్తాన్ని ప్రదర్శిస్తూ మాట్లాడాడు. అంతే ఒక్కసారి కోపం నషాళానికి అంటింది. వెంటనే అతని చెవులు వాచిపోయేలా దుమ్ముదులిపేశా' అని రాధికా ఆప్టే తెలిపింది. అయితే, ఆమె ఆ నటుడి పేరు చెప్పకపోవడం విశేషం. రాధికా ఆప్టే కెరీర్ తొలినాళ్లలో 'రక్తచరిత్ర'లో నటించిన సంగతి తెలిసిందే. అప్పటికి ఆమెకి పెద్దగా పేరు ప్రఖ్యాతులు రాలేదు.