: టీమ్ తో ఢిల్లీ వెళ్లిన కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రేపు జరగనున్న తెలుగు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులపై జరగనున్న అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొననున్న ఆయన తెలంగాణ వాదన వినిపించేందుకు సర్వసన్నద్ధంగా వెళ్లారు. దీంతో సమర్థవంతమైన వాదన వినిపించేందుకు తనతో పాటు తెలంగాణ జలవనరుల శాఖ మంత్రి హరీశ్ రావు, సీఎస్ రాజీవ్ శర్మ, ఇతర నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులను కూడా తీసుకెళ్లారు.