: నాగార్జునను ఒక్కసారి చూసి చచ్చిపోతే చాలని అతను అనేవాడు: నటుడు నిఖిల్


నాగార్జునను ఒక్కసారి చూసి చనిపోతే చాలని, చందూ మొండేటి సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు అనేవాడని ప్రముఖ నటుడు నిఖిల్ అన్నాడు. ‘ప్రేమమ్’ ఆడియో రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ‘చందూ గురించి చెప్పాలంటే .. చందూ అసలు సినిమా ఇండస్ట్రీకి వచ్చిందే నాగార్జునగారిని చూసేందుకు. నాగార్జున గారి ‘శివ’ చిత్రం చూసి ఇన్ స్ఫైర్ అయి చందూ సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. నేను, చందూ కూడా కలిసి కూడా అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేశామం. నన్ను హీరోగా పెట్టి ‘కార్తికేయ’ సూపర్ హిట్ చిత్రం తీశాడు. ఈ సినిమా తర్వాత ఏ సినిమా తీస్తావో అంటే .. ప్రేమమ్ చిత్రం తీస్తున్నానని చెప్పాడు. ఈ చిత్రం సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం నాకుంది ’ అని నిఖిల్ చెప్పాడు.

  • Loading...

More Telugu News