: 25 ఫ్లాపులు వచ్చినా నా సోదరుడు సూపర్ స్టారే: కరీనా కపూర్
బాలీవుడ్ నటుడు రణ్ బీర్ కపూర్ స్టార్ డమ్ పై ఫ్లాపులు ఎలాంటి ప్రభావం చూపవని అతని సోదరి, స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ ధీమాగా చెప్పింది. హిందీ చలన చిత్ర పరిశ్రమలో రణ్ బీర్ కపూర్ సూపర్ స్టార్ అని పేర్కొంది. అతని స్టార్ డమ్ ను హిట్లు, ఫ్లాపులు తగ్గించలేవని పేర్కొంది. వరుసగా 25 ఫ్లాపులిచ్చినా రణ్ బీర్ స్టార్ హీరోగానే ఉంటాడని తెలిపింది. హిట్లు, ఫ్లాపులు ప్రతి నటుడి జీవితంలోనూ భాగమని తెలిపింది. తాను కూడా పలు ఫ్లాపులు ఎదుర్కొన్నానని కరీనా తెలిపింది. 'యే దిల్ హై ముష్కిల్' సినిమాతో రణ్ బీర్ కపూర్ మళ్లీ ఫాంలోకి వస్తాడని కరీనా ఆశాభావం వ్యక్తం చేసింది. 'బేషరమ్', 'బొంబే వెల్వెట్' సినిమాలు డిజాస్టర్ లు గా నిలిచి రణ్ బీర్ ను తీవ్ర నిరాశకు గురిచేసిన సంగతి తెలిసిందే.