: వీర జవాన్లకు మా సెల్యూట్: టీమిండియా హెడ్ కోచ్ కుంబ్లే
జమ్మూకాశ్మీర్ లోని యూరీ సెక్టార్ లో జరిగిన ఉగ్ర దాడిలో 18 మంది సైనికులు వీరమరణం పొందడంపై టీమిండియా తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసింది. టీమిండియా హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే మీడియాతో మాట్లాడుతూ, 'వీర జవాన్లకు టీమిండియా సెల్యూట్ చేస్తోంది. మా తరపు నుంచి వారికి అమితమైన గౌరవం ఉంటుంది. మనల్ని నిరంతరం కాపాడుతూ ఉండే వీరులకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. వీర సైనికుల కుటుంబాలు ఈ సంఘటనను మర్చిపోవడం అంత తేలిక కాదు’ అని అన్నారు.