: ఉగ్రవాదుల మృత దేహాలను పబ్లిక్‌గా దహనం చేయండి: ప్రవీణ్ తొగాడియా
యూరీ సెక్టార్ లో సైనికులపై దాడికి దిగి 18 మందిని హతమార్చిన నలుగురు పాక్ ఉగ్రవాదుల మృతదేహాలను చెత్తకుప్పలో పడేసి పబ్లిక్ గా దహనం చేయాలని విశ్వహిందూ పరిషత్ చీఫ్ ప్రవీణ్ తొగాడియా డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, యూరీ సెక్టార్ లో వీరమరణం పొందిన అమర వీరుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. పాక్ పై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. పాకిస్థాన్ తో అన్ని స్థాయుల చర్చలను వెంటనే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. తాగు నీటి సరఫరాతో పాటు వ్యాపార ఒప్పందాలను రద్దు చేసుకోవాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు.