: లీకైన ఫోటోల్లో ఉన్నది నా భర్తే: హీరోయిన్ సోను గౌడ వివరణ
కన్నడ హీరోయిన్ సోను గౌడ (శృతి రామకృష్ణన్) వ్యక్తిగత ఫొటోలు ఆన్ లైన్ లో లీక్ కావడంపై ఆవేదన వ్యక్తం చేసింది. కన్నడనాట న్యూస్ చానెళ్లు ఆ ఫొటోలను ప్రసారం చేయడానికి తోడు, రాజకీయ నాయకుడి కొడుకు అని, అతనితో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ప్రచారం చేయడం పట్ల సోను గౌడ తీవ్ర మనస్తాపం చెందింది. దీంతో మీడియా ముందుకు వచ్చి, ఆ ఫోటోల్లో ఉన్న వ్యక్తి తన భర్త మనోజ్ గౌడ అని తెలిపింది. మీడియా తీరు తనను షాక్ కు గురి చేసిందని, వాస్తవాలు కనుక్కోకుండా ప్రచారం చేసేశారని మండిపడింది. తనకు జరిగిన పరువు నష్టంపై ఈ ఫోటోలను లీక్ చేసిన వ్యక్తిపైన, తప్పుడు కథనాలు ప్రసారం చేసిన మీడియా సంస్థలపైన చట్టపరమైన చర్యలకు దిగుతానని స్పష్టం చేసింది.